ASR: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.