TG: మోడల్ స్కూల్స్లో మరో స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్లో రిటైర్డ్ అధికారులే సర్వీస్ పొడిగించుకుంటూ అక్రమాలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్కో ప్యాకేజీ రూ.1,000 కోట్లుగా విభజించి.. తమ వారికే కట్టబెట్టారన్నారు. బీజేపీ నాయకులకు కూడా 2 ప్యాకేజీలు దక్కాయన్నారు. అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతా అని చెప్పారు.