TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ, ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే సర్జరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారికి హైడోస్ ఇచ్చి చంపేశారంటున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.