AP: చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్(108) కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వాత్రంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందిన రాజన్.. 1967లో స్వతంత్ర పార్టీ నుంచి పలమనేరు MLA గా గెలుపొందారు. గాంధీ, బోస్ సిద్ధాంతాలను ఆనుసరిస్తూ.. ప్రభుత్వ పెన్షన్‌తోనే నిరాడంబర జీవితం గడిపారు.