ADB: ఆదిలాబాద్ DCC ఉపాధ్యక్షుడిగా సుడగోని సుధాకర్ గౌడ్‌ను నియమిస్తూ గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సుధాకర్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.