TG: అసెంబ్లీలో MIM ఎమ్మెల్యేల తీరు సరికాదు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారని, కేంద్రం ఆదేశాలను వారు ధిక్కరించారని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ చెప్పలేని పరిస్థితి ఉందని, వారి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే అని స్పష్టం చేశారు.