TG: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని CM రేవంత్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతులకు రుణభారం తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 22 నుంచి రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.