WG: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మత పెద్దలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలను ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం ఆకివీడులో పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున నగదును ఆయన అందజేశారు. మత పెద్దలు మాట్లాడుతూ.. పండుగ సమయంలో తమకు ఈ సాయం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.