పాకిస్తాన్లో స్పైగా రణ్వీర్ సింగ్ సాగించే మైండ్ గేమ్, యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదించినా, సెకండాఫ్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రణ్వీర్ నటన, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది.