MHBD: తొర్రూరు పట్టణంలోని విజయ లక్ష్మి హాస్పిటల్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ఈ తనిఖీ సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండటం గమనార్హం. దీంతో సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.