E.G: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. బుధవారం కోరుకొండ బస్టాండ్ వద్ద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.