AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించారన్నారు. 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.