TPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19న శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమ్మవారిని చందన అలంకారంలో భక్తులకు స్వర్ణ కిరీట విశ్వరూప దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా విశేషంగా లక్ష కుంకుమార్చన నిర్వహించబడుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని అధికారులు కోరారు.