PDPL: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ కార్మికులకు ఆదివారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా వారిని గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీనివాస్ శాలువాలతో సన్మానించి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.