PLD: అమరజీవి 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు శాఖమూరి పార్క్లో ఏర్పాటు చేయనున్న కాంస్య విగ్రహం, స్మృతి వనం కార్యక్రమానికి మద్దతుగా ఆర్యవైశ్యుల ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యుల నాయకులు పాల్గొన్నారు.