సత్యసాయి: బత్తలపల్లి మండలం దంపెట్ల శివారులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో 800 ఏళ్ల నాటి అరుదైన కన్నడ శాసనం వెలుగులోకి వచ్చింది. చరిత్రకారుడు బుక్కపట్నం గోపి దీన్ని గుర్తించారు. క్రీ.శ. 1225 జనవరి 21న ఈ శాసనం వేయించబడిందని, అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘మధురాపురం’గా పిలిచేవారని తెలిపారు. కునుతూరులో కూడా అదే కాలానికి చెందిన మరో శాసనం గుర్తించినట్లు వెల్లడించారు.