కడప: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కడప నగరంలోని గోకుల్ లాడ్జీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.