GNTR: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా తుళ్లూరులో నిర్మించిన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని అమరజీవికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.