AP: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని మాజీమంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ‘పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు మోపారు. గతంలో ఎస్పీ సైతం ఈ హత్య కేసులో వారికి సంబంధం లేదని చెప్పారు. పిన్నెలి ఆరోగ్యం క్షీణించింది. ఈ దుశ్చర్యకు తగిన ప్రతిఫలం చంద్రబాబు, లోకేష్ అనుభవిస్తారు’ అని విమర్శించారు.