TG: రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ, వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.