తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంది. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయి. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దాం’ అని సూచించారు.