KMM: కారేపల్లి మండలం గుట్టకిందగుంపు శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను జిల్లా మైనింగ్ ఏడీ సాయినాథ్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అడవిగుట్ట ప్రాంతంలో దాడులు నిర్వహించి, జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్న వాహనాలను పట్టుకుని కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.