NLR: బుచ్చిరెడ్డిపాలెం (M) పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి. పరీక్షలు రాసి ఉత్సాహంగా విద్యార్థులు బయటికి వచ్చారు. పరీక్షలు ఎలా రాశారని తల్లిదండ్రులు విద్యార్థులను ఆరా తీశారు. మండల వ్యాప్తంగా 1041 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1025 హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష పేపరు సులభంగా వచ్చిందని పరీక్షలు బాగా రాసామని విద్యార్థులు చెప్పారు.