ATP: రాయదుర్గం మండలం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన NCC క్యాడెట్ జే గౌతమ్ రాజ్ అడ్వెంచర్ క్లైమ్బింగ్లో ప్రతిభ చాటాడు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు బీఎస్సీ గణితశాస్త్రం చదువుతున్న గౌతమ్ రాజ్ సాహస క్రీడలైన అడ్వెంచర్ క్లైమ్బింగ్లో అసాధారణ ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఆయనను అధ్యాపక బృందం అభినందించారు.