KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక గిద్ద హరిజనవాడలో, ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని బుధవారం మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు అందజేస్తున్న పోషక పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా, జాగ్రత్తలు పాటించాలని అంగన్వాడి టీచర్ కు వివరించారు.