AP: రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘ఇఫ్తార్ విందు ఇవ్వడమనే సంప్రదాయాన్ని దశాబ్దకాలంగా కొనసాగిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మైనార్టీలకు పెద్దఎత్తున సంక్షేమం అందించాం. నేనెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటా’ అని పేర్కొన్నారు.