KRNL: కోసిగి మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినీలతో వంట పనులు, పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని SFI నాయకులు రంగప్ప, శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం జేసీ నూర్ కమల్‌కు ఫిర్యాదు చేశారు. డస్ట్‌బిన్ బకెట్లలో త్రాగునీరు నింపి విద్యార్థులకు త్రాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలన్నారు.