TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ ఉండటం గమనార్హం. 188 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, 52 మందికి జరిమానా.. మరో నలుగురికి 2 రోజుల జైలు+జరిమానా విధించారు.