కృష్ణా: గన్నవరంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం జరిగింది. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని MLA యర్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో రూ. 20,000 జమ చేశామని చెప్పారు.