TG: రాష్ట్రంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఇవ్వలేదని BRS MLA ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కనీసం గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టలేదన్నారు. మహిళలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. పింఛన్ రూ.4 వేలకు పెంచుతామన్నారని, అదీ లేదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారని, మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, రైతుబంధుపై గవర్నర్తో అబద్ధాలు చెప్పిచ్చారని తెలిపారు.