AP: త్వరలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని టాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రకటించాడు. నారావారాపల్లిలో తన తండ్రి నారా రామ్మూర్తినాయుడు 74వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాసేపు జర్నలిస్టులతో చిట్ చాట్ చేశాడు. తండ్రి ఫ్యాన్స్ కోరిక మేరకు సరైన సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశాడు.