పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం ఇద్దరి కెరీర్‌కు కీలకం కానుంది. మిస్టర్ బచ్చన్‌తో అట్టర్ ఫ్లాప్ చవిచూసి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు హరీష్ శంకర్‌కు, ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న హీరోయిన్ శ్రీలీలకు ఈ సినిమా తప్పక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.