TG: ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజిస్టర్లో ఆమె వేలిముద్రలు నమోదు చేశారు. సీబీఐ కేసు నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ పూర్తికి వేలిముద్రలు వేశారు. అనంతరం ఆమె హైదరాబాద్ బయలుదేరారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు అనుమతి ఇస్తూ.. ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.