ATP: ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో రేపు ఉమ్మడి జిల్లాకు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు.