అనంతపురం సాయి నగర్లోని AVPR మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మజెస్టిక్ మింగిల్ కమ్యూనిటీ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ఆమె సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.