AP: మన్యం జిల్లా సాలూరులోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే పథకం వర్తిస్తుందని తెలిపారు. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే దివ్యాంగ శక్తి లక్ష్యమన్నారు.