E.G: రాజమండ్రిలో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నంచి జిల్లా కలెక్టరేట్ వరకు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కలెక్టర్ కీర్తి చేకూరి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.