AKP: ఎలమంచి మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఈనెల 17తో ముగిసింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో వీవీ రమణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తరంలో జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు బుధవారం తెలిపారు. ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రమణ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.