MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం గ్రామంలో సోమవారం భారీ సంఖ్యలో గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురై భారీ సంఖ్యలో గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాధిత రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతు మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.