AP: YS వివేకానందరెడ్డిని సునీత భర్త హత్య చేసినట్లు MP అవినాష్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని PCC చీఫ్ షర్మిల ఆరోపించారు. వివేకా హత్యను సాక్షి మీడియా గుండెపోటు అని ప్రచారం చేసిందని చెప్పారు. వివేకా హత్య TDP పనే అని జగన్ చెప్పారని పేర్కొన్నారు. వివేకా హత్యపై CBI విచారణ కోరింది కూడా జగనేనని గుర్తు చేశారు. వివేకా హత్యను అడ్డుపెట్టుకుని జగన్ CM అయ్యారని వెల్లడించారు.