VZM: గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం చెత్త సేకరణ రిక్షాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛరథం మండలానికి ఒక్కటి కేటాయించడం జరిగిందన్నారు. పారిశుధ్యం పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఎంపీడీవో కళ్యాణి, ఎంపీపీ జ్ఞాన దీపిక తదితరులు పాల్గొన్నారు.