NRML: మహిళల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కడెం మండలం నర్సాపూర్ సర్పంచ్ సంగీత అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వీఓ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాజేష్, రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.