AP: జీవితంలో ఓటమి సహజమని.. దానిద్వారా అనేక పాఠాలు నేర్చుకోవాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రనా బాధపడాల్సిన పనిలేదన్నారు. ‘తల్లికి చెప్పలేని ఏ పనీ చేయవద్దన్న చాగంటి మాటలను అనుసరిస్తున్నా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది తల్లికి చెప్పగలమా? అని ఆలోచించాలి. అలాగే, మహిళలను అవమానిస్తూ వాడే పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి’ అని పేర్కొన్నారు.