MHBD: రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం తొర్రూరు జడ్పీ హైస్కూల్, గుర్తూరు మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు RBSK మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో కంటి సమస్యలను తొందరగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారి విద్యాభ్యాసం మెరుగుపడుతుందన్నారు.