SRD : గుమ్మడిదల మండల పరిధిలో మంబాపూర్, కొత్తపల్లి, నల్లవల్లి నాగిరెడ్డిగూడెం తదితర ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎంఈవో పౌలీణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికలు, పాఠశాల రిజిస్టర్లు, బోధన నిర్వహణను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల హాజరు పెంపు, నాణ్యమైన బోధనపై సూచనలు చేశారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.