ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. సోమవారం పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న కానుకలను తహసీల్దార్ రాజలింగు, సర్పంచ్ బానోత్ కావేరి కలిసి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.