AP: టీవీకే అధినేత విజయ్ ఎన్డీయేలో చేరుతున్నారని, దానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నాననే ప్రచారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. విజయ్ వద్ద తాను అటువంటి ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందనే ఊహాగానాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పవన్ తేల్చి చెప్పారు.