కడప: నగరంలోని 1వ డివిజన్ పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ గ్రీవెన్స్ డే సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు. ప్రధాన కాలువ లేకపోవడంతో మురుగునీరు పేరుకుపోయి దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.