స్టార్ హీరో అజిత్‌పై నటి తమన్నా ప్రశంసలు కురిపించింది. ‘వీరం’ షూటింగ్ సమయంలో అజిత్ తన క్యారవాన్‌లో స్వయంగా ఇడ్లీలు చేసి పెట్టారని, ఒక అగ్ర హీరో అలా చేయడం చూసి తాను షాక్ అయ్యానని తెలిపింది. అజిత్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ అని, ఆయనకు వంట అంటే ప్రాణమని చెప్పింది. అంతేకాదు సినీ రంగంలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.