NLR: శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘అమర్ రహే పొట్టి శ్రీరాములు’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు.